‘గౌ మహా హారతి 2026’
20-03-2026 12:00 AM
గోమాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి) : గోమాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం గౌ మహా హారతి 2026’ సంబంధించిన అధికారిక ప్ర కటనను బేగంపేట్, కేటినేని డిజిటల్స్ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ కార్యక్ర మంలో అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ, ప్రొఫెసర్ డా. హరిదేవరాయ చౌ దరి, డా. అమితరాణి, నటుడు, గౌమాత సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైభవ్ సూర్యతో పాటు, ట్రస్ట్ సభ్యులు హాజరయ్యా రు. మార్చి 28, 29 తేదీలలో అమీర్‌పేట్ ధర్మ కరం రోడ్డులోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్సు లో నిర్వహించబడనుంది. మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ మాట్లాడుతూ.. గౌ సేవ మన సంస్కృతి, సంప్రదాయాలలో ఎంతో ముఖ్యమైనది అన్నారు.




