గిరిజన గూడాల్లో గావ్ సాత్
- పొలిమేర పోచమ్మ తల్లికి పూజలు
ఉట్నూర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ తర్వాత ఆదివాసీ గిరిజనులు పొలిమేర పోచమ్మ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివాసీ గూడాల్లోని ఆదివాసీ గిరిజనులు గావ్ సాత్ (ఇంటింటి బయట వంటలు) కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆదివాసీ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు. పొలిమేరలో అక్కడే వంటలు చేసుకుని పిల్లాపాపలతో కలిసి వనభోజనం చేశారు.
ఆదివాసీ గూడలోకి దుష్ట శక్తులు ఆవరించకుండా, ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన పంటలపై అడవి ప్రాణులు దాడి చేయకుండా కాపాడాలని ఆదివాసీ గిరిజనులు పోచమ్మ తల్లికి మొక్కుకున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని ఆదివాసీ గిరిజనులు చాలా గ్రామాల్లో ఆదివారం పొలిమేర పోచమ్మ పూజలు నిర్వహించారు.






