అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
41 పశువులు స్వాధీనం
బెజ్జూర్ ఆగస్టు 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సుస్మీర్ గ్రామ శివారులో అక్రమంగా పశువులందను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషాకు అందింది.వెంటనే బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషా తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, వారి వద్ద నుండి మొత్తం 41 పశువులను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న పశువుల్లో 10 ఎద్దులు, 21 ఆవులు మరియు 10 దూడలు ఉన్నాయి.విచారణలో నిందితులు మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.ఈ ఘటనపై నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.






