30 August, 2026 | 12:44 PM

చౌటబెట్ల యువతికి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్.!

30-08-2026 11:27 AM

కొల్లాపూర్ రూరల్: మండలంలోని చౌటబెట్ల గ్రామానికి చెందిన కోళ్ల చంద్రయ్య–దేవేంద్రమ్మ దంపతుల కుమార్తె కోళ్ల సునీత భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో ఉన్న ఎస్‌జెజేటీయూ విశ్వ విద్యాలయంలో డాక్టర్ నితికా చౌదరి మార్గదర్శకత్వంలో సునీత పరిశోధన పూర్తి చేశారు. స్ఫటికాల అంతర్గత పరమాణు అమరిక, వాటి సామ్యరూపతను గణితశాస్త్ర పరంగా అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సునీత ఉన్నత విద్యలో ఈ ఘనత సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ కౌన్సిలర్ వంగ అనూష మాట్లాడుతూ గ్రామీణ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. సునీతను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.