2 August, 2026 | 1:50 AM

సాగర్ రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డి ఫ్లైఓవర్‌కు నిధులు మంజూరు చేయాలి

02-08-2026 12:41 AM

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ కార్పొరేటర్ సుజాతా నాయక్ వినతి 

రంగారెడ్డి ,ఆగస్టు 1(విజయక్రాంతి ): సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా నుంచి హస్తినాపురం మీదుగా బీఎన్రెడ్డి నగర్ వరకు ఫ్లైఓ వర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హస్తినాపురం డివి జన్ మాజీ కార్పొరేటర్ సుజాతా నాయక్ కోరారు. ఈ మేరకు సాగర్ రింగ్ రోడ్డు చౌ రస్తా నుంచి హస్తినాపురం మీదుగా బీఎన్రెడ్డి నగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనలను సీఎంకు అందజేశారు. త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశముందని తెలిపారు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సహకారంతో ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నా రు. ‘సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్రెడ్డి వర కు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందన్నారు. ఉదయం, సాయంత్రం వేళ ల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాలనీలు పెరుగుతున్న కొద్దీ వాహనాల రద్దీ మరింత అధికమవుతోందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమని వివరించారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సుజాత నాయక్ పేర్కొన్నారు.