4 March, 2026 | 3:37 AM

పనులు చేయకుండానే నిధులు స్వాహా

04-03-2026 01:00 AM

రైల్వే శాఖలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు నిర్మాణ సంస్థపై సీబీఐ కేసు నమోదు

మహబూబాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): కాజీపేట రైల్వే సెక్షన్లో ట్రాక్ మరమ్మతు పనుల్లో అక్రమాల కు పాల్పడ్డారని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు పలువురు రైల్వే ఇంజనీ రింగ్ అధికారులు, సిబ్బందిపై సీబీఐ కేసు 120బీ కుట్ర, 420 అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

రైల్వేవర్గాల కథనం ప్రకారం కాజీపేట రైల్వే సెక్షన్‌లో ట్రాక్ మైంటెనెన్స్ పనుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మెయింటెనెన్స్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. క్షేత్రస్థా యిలో అధికా రులు తనిఖీలు చేయకుండానే బిల్లులు పాస్ చేశారని, అందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ ఖాతాల నుంచి ఇంజనీర్ అధికారుల ఖాతాలకు అనుమానస్పద చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు.

కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ట్రాక్ నిర్వహణ కాంట్రాక్ట్ చేపట్టిన సంధ్య కన్స్ట్రక్షన్ అనే కంపెనీ కాజీపేట పెద్దపల్లి రైల్వే మార్గాల్లో ట్రాక్ మైం టెనెన్స్ పనుల కోసం కాంట్రాక్టులు దక్కించుకొని ఇంజనీరింగ్ అధికారుల తో కుమ్మ క్కై రైల్వే శాఖకు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించినట్లు సీబీఐ గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మెయింటెనెన్స్ పను ల కుంభకోణంలో బాధ్యులైన ముగ్గురు ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ మైంటైనర్లు, కాం ట్రాక్టు సంస్థకు చెం దిన ఎనిమిది మందిపై సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొన్ని పనులు  అసలే నిర్వహించకుండా, తప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లు రూపొందించడం, 2022 నుంచి 2024 వరకు పలు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సీబీఐ గుర్తించిందని సమాచారం. పనులు చేయకుండా బిల్లులు తీసుకోవడం వల్ల రైల్వే ట్రాక్ నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ప్ర మాదాలు జరిగితే పెద్ద ఎత్తున రైల్వే శాఖకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉండేదని భావిస్తున్నారు.