calender_icon.png 13 February, 2026 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిడేపల్లి గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందజేత

13-02-2026 06:29:40 PM

గరిడేపల్లి,ఫిబ్రవరి 13,(విజయ క్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి గ్రామపంచాయతీ కి ప్రీజర్ బాక్స్ ను దాతలు శుక్రవారం అందజేశారు.ఎవరైనా మరణించిన సమయంలో మృతదేహాన్ని వారి బంధువులు,కుటుంబ సభ్యులు దూరం నుంచి గ్రామానికి చేరేవరకు ఫ్రీజర్ లో ఉంచే అవకాశం ఉండటంతో దీనిని గ్రామపంచాయతీకి అందజేసినట్లు దాతలు తెలిపారు.గరిడేపల్లి కి చెందిన  ప్రధాని కిష్టయ్య పేరుమీద వారి కుమారులు ప్రధాని నాగయ్య,ప్రధాని రామ్మూర్తి, ప్రధాని సైదులు,ప్రధాని వెంకటేశ్వర్లు బహూకరించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి,ఉప సర్పంచ్ మాతంగి సంజీవ,మేకపోతుల అఖిల్,మాజీ సింగిల్ విండో చైర్మన్ పెండెం ముత్యాలు గౌడ్,గట్టి గొప్పల కృష్ణారెడ్డి,బండ సీతారాంరెడ్డి,గుంటూరు రాము,గుండు సైదులు,పెండెం కాశయ్య,మేకపోతుల రామకృష్ణ,రాగిరెడ్డి చంద్రారెడ్డి,మేకపోతుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.