17 April, 2026 | 7:59 PM

మాల్తుమ్మెద గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం

17-04-2026 06:41 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద  గ్రామంలో జిల్లా పశుగాణభివృద్ధి సంఘం మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... రైతులు పశువ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. మాల్తుమ్మెద గ్రామంలో 49 గేదలకు మరియు 2 ఆవులకు గర్భశాయ చికిత్సలు చేయడం జరిగింది. 41దూడలకు నట్టల నివారణ మందులు మరియు 24 సాధారణ చికత్సలు 24 సిసిటీవీ రైతులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, ఉప సర్పంచ్ శివకుమార్, డిఎల్డిఏ సూపెర్వైసోర్ కృష్ణ, విఏ విజయ, మైత్రి, శ్రీహరి, పరందాములు, ఓఎస్ జయరాజు గంగారాము, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.