17 August, 2026 | 6:55 PM

18న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

17-08-2026 06:09 PM

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఈ నెల 18న నస్పూర్ కాలనీలో నిర్వహిస్తున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం(పర్సనల్) ఎస్ . అనిల్ కుమార్ సోమ వారం తెలిపారు.

హైదరాబాద్ లోని మాతా రీసెర్చ్ సెంటర్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విశ్వానాథ మహర్షి ఆధ్వర్యంలో నస్పూర్ లోని మనోరంజన్ సముదాయ్ లో నిర్వహించే ఈ ఆయుర్వేద వైద్య శిబిరం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీర్ఘకాలిక వ్యాదులైన బీపీ, షుగర్ లతో పాటు మలబద్దకం, పక్షవాతం, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి ఇతర వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారని, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.