డివిజన్ ప్రజావాణిలో నాలుగు వినతులు
21-07-2026 12:03 AM
బోధన్, జూలై 20 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నాలుగు దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సహకార సంఘం (సొసైటీ) ద్వారా పురుగుమందుల సబ్సిడీ అందలేదంటూ ఒక ఫిర్యాదు, హౌస్ నంబర్ మంజూరు చేయాలంటూ ఒక వినతి, ప్రైవేట్ స్థలంలో అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని మరో ఫిర్యాదు, వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలంటూ మరో దరఖాస్తును సంబంధిత అభ్యర్థులు సమర్పించారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.






