9 May, 2026 | 2:33 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

నాలుగు ఎకరాల కోసం నాలుగు దశాబ్దాల పోరాటం

28-02-2026 07:45 PM

* మా భూములు మాకే ఇవ్వాలి 

*  ఆనందాపురం గిరిజనుల డిమాండ్

అశ్వాపురం,(విజయక్రాంతి): ఆనందాపురం గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు తమకు వారసత్వంగా వచ్చిన సుమారు నాలుగు ఎకరాల భూమి అక్రమంగా పట్టాలు చేయించుకుని కొంతమంది ఆధిపత్య వర్గాల వ్యక్తులు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విషయమై ప్రశ్నించగా తమపై తప్పుడు కేసులు నమోదు చేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

గ్రామంలో సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా, పెద్దమనుషులుగా వ్యవహరిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి తమ హక్కుల నుంచి దూరం చేస్తున్నారని వాపోయారు. రెవిన్యూ కార్యాలయంలో పలుమార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ స్పందన లభించలేదని, తమ భూముల వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయపరమైన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేస్తూ తమ హక్కులను వదులుకోబోమని తెలిపారు.