10 May, 2026 | 11:37 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

22 వార్డుల్లో ‘ఫార్వర్డ్ బ్లాక్’ విజయం

14-02-2026 12:58 AM

వడ్డేపల్లిలో మొత్తం పది వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు కైవసం

విజయక్రాంతి, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అ భ్యర్థులు 22 స్థానాల్లో విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డే పల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) షాక్ ఇచ్చింది. మునిసిపాలిటీలో మొత్తం 10 వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సింహం గుర్తు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కో స్థానానికి పరిమితం అయ్యాయి.

ఈ విజయం సందర్భంగా కార్యకర్తలు సింహం గుర్తు జెండాలతో భారీర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. 9 వార్డులో ఏఐఎఫ్‌బీ తరఫున బరిలో నిలిచిన నాయకి అజయ్‌పై బీఆర్‌ఎస్ అభ్యర్థి పోలకల్ సూరి 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సా ధించారు. ఇక రామగుండం కార్పొరేషన్‌లో ఏఐఎఫ్‌బీ 6, పెద్దపల్లి  మున్సిపాలిటీలో 5, నల్లగొండ కార్పొరేషన్‌లో4, కరీంనగర్ కా ర్పొరేషన్‌లో2, మంచిర్యాల కార్పొరేషన్‌లో ౨, దుబ్బాక, జమ్మికుంట, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానంలో గెలిచింది.