1 May, 2026 | 6:16 AM

వివాహ వేడుకల పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ

01-05-2026 02:24 AM

నాగిరెడ్డిపేట్,ఏప్రిల్ 30 (విజయక్రాంతి): వివాహ వేడుకల్లో పాల్గొన్న నాగిరెడ్డిపేట మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి.మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి తన బాల్య స్నేహితుడు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి కుమార్తె సృజన పెళ్లి వేడుకలు హైదరాబాదులోని కొంపల్లి కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరగడంతో హాజరై వధూవరులను ఆశీర్వదించి పుష్పగుచ్చం అందజేసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నూరేళ్ల జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని తెలిపారు. 38 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై తన చిన్ననాటి పదవ తరగతి స్నేహితులు కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ రెడ్డి,శంకర్ రెడ్డి,సురేందర్ రెడ్డి సత్యనారాయణ,జనార్దన్, భూమయ్య,కరుణాకర్ రెడ్డి, సులోచన,విద్యారాణి,సావిత తదితరులు పాల్గొన్నారు.