6 March, 2026 | 1:50 PM

ముత్తారం మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్య గుండెపోటుతో మృతి

06-03-2026 10:19 AM

రాజయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తిరనిలోటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల రాజయ్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు.‌ కుటుంబ సభ్యులు స్థానికుల కథనం రాజయ్య ఉదయం గుండె నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ వైద్యునికి చూపించగా అతను వెంటనే పెద్ద పెళ్లికి వెళ్లాలని తెలుపటంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతుండగా,  మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచనల మేరకు  కరీంనగర్ కు రాజయిన తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు.

రాజయ్య మృతి తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు. ముత్తారం మాజీ జెడ్పిటిసి లు చొప్పరి సదానందం,  నాగినేని జగన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, ముత్తారం మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్య మృతి కుటుంబ సభ్యులకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటని మంత్రి తెలిపారు.