12 April, 2026 | 1:55 PM

బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా

12-04-2026 12:11 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని సీతారామపురం గ్రామం లో శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ట, ముత్యాలమ్మ తల్లి, బొడ్రాయి(నాభిశిలా) ప్రతిష్ఠా మహోత్సవంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చాను కమిటీ వారు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ ZPTC పైడి వెంకటేశ్వరరావు, చీకటి రామయ్య, గణేష్పాడు సర్పంచ్ మీడియం వెంకటేష్, గుండె శంకర్, నెల్లూరి గోపాల కృష్ణ, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.