9 May, 2026 | 6:48 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

శివరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఆహ్వానం

14-02-2026 12:35 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోనీ శ్రీ త్రికుటేశ్వర ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఆయనను కలసి ఆహ్వాన పత్రిక అందజేసి, ఉత్సవాల ఏర్పాట్లు మరియు కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, అన్నప్రసాద వితరణతో పాటు భక్తులకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరడి జైపాల్ రెడ్డి, కాశిరెడ్డి ఆదిరెడ్డి, మ్యాక స్వామి తదితరులు పాల్గొన్నారు.