రేవంత్ ప్రభుత్వంలో అన్ని స్కాములే
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో(Manakondur Constituency) బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.... రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని స్కాములే అన్నారు. చివరికి బడి పిల్లలకు అన్నం పెట్టే దాంట్లో కూడా స్కామేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కాములు లేని విభాగమే లేవన్నారు. 4 శాతం వడ్డీకి రూ. 1,3600 కోట్ల రుణం ఇచ్చేందుకు ఐఆర్ఎఫ్ సీ ఒప్పుకున్నదన్నారు. పాఠశాల విద్యార్థులకు అన్నం పెట్టేదాంట్లో స్కామ్ అంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. దుస్తులు, టై, బూట్లు రూ. 1200 కోట్లతో టెండర్లు పిలిచారు. ఉప్పు, పప్పు, కూరగాయాలకు రూ. 800 కోట్లతో టెండర్ల పిలిచారు. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియదంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. పొన్న ప్రభాకర్ తనను విమర్శించేటప్పుడు రూ. 680 కోట్లు అంటున్నారు. టెండర్లు మొత్తం ఎంతో తెలియని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.






