16 June, 2026 | 2:55 PM

సర్పంచ్ చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ

16-06-2026 01:50 PM

​వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల(Government Tribal Ashram High School) విద్యార్థులకు ప్రభుత్వం నుంచి సరఫరా అయిన ఉచిత పాఠ్యపుస్తకాలను గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, విద్యార్థుల ప్రగతికి నిరంతరం శ్రమిస్తున్న సర్పంచ్ కృష్ణాజీ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు. నిరుపేద గిరిజన విద్యార్థుల చదువులకు, పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధిగా తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ భరోసా ఇచ్చారు. విద్యా రంగంపై సర్పంచ్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ఆయన అందిస్తున్న ప్రోత్సాహం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, వార్డు సభ్యురాలు భూరి సాలక్క, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి,ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) లక్ష్మీ ప్రసన్న, పీటీ కృష్ణమూర్తి,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.