ఏసీబీ దాడుల్లో నరహరి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో రూ.1.10 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి(Deputy Director Narahari) నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. నరహరి నివాసం, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Raids) నిర్వహిస్తున్నారు. నరహరి ఇళ్లు, బంధువుల ఇళ్లు సహా 12 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు నరహరి ఇంట్లో పడకగదిలో బెడ్ కింద భారీగా నోట్ల కట్టలు గుర్తించారు.
పడకగదిలో బెడ్ కింద భారీ మొత్తంలో నగదు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నరహరి ఇంట్లో రూ. 1.10 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సుంకరి నరహరి, సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నరహరికి హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాంట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయభూమి ఉన్నట్లు గుర్తించారు.
అవినీతి నిరోధక శాఖ దాడులు, రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్ ను ఫాలో అవ్వండి.
హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్, అధికారుల దాడులు, ముఖ్య ఘటనల కోసం హైదరాబాద్ వార్తలు విభాగాన్ని సందర్శించండి.






