calender_icon.png 21 February, 2026 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన మాజీ కార్పొరేటర్ శాంతి

21-02-2026 05:35:48 PM

ఉప్పల్,(విజయక్రాంతి):  ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పోరేటర్ గా ఉన్న సమయంలో సుమారు నాచారంలో రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయని తెలియజేశారు.

ఇదే కాకుండా జీహెచ్ఎంసీ చివరి స్టాండింగ్ కమిటీలో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు నాచారం రైతు బజార్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మూడుకోట్ల రూపాయలు అలాగే ఎర్రగుంటలోని హిందూ స్మశాన వాటికను వైకుంఠధామముగా తీర్చిదిద్దటానికి రెండు కోట్ల రూ.90 లక్షల అనుమతులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. తొందరలోనే ఈ రెండు పనులు కూడా టెండర్ కాగానే పనులు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. 

ఇదే కాకుండా హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును రూ.30 కోట్లతో సుందరీకరించినట్లు తొందర్లోనే చెరువును ఖాళీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ రాఘవేంద్ర నగర్ కాలనీవాసులు మక్తాల శేఖర్ గౌడ్, సంఘం యాదగిరి విట్టల్ యాదవ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు