4 May, 2026 | 3:05 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

కవిత ఎవరో ఆడించినట్లు ఆగుతున్నారు: గొంగిడి సునీత

05-01-2026 05:28 PM

కవిత బాధ చూడలేక కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు

కూర్చున్న కొమ్మ నరుక్కునే ప్రయత్నం

హైదరాబాద్: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేకుంటే.. తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మీరెందుకు మార్చారు? అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత(Former BRS MLA Gongidi Sunitha) కవితను ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ లో ఓడిపోతే మీ బాధ చూడలేక కేసీఆర్ పదవి ఇచ్చారని సునీత తెలిపారు.

పార్టీలో ప్రాధాన్యం లేకుండానే రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా? అని సునీత ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను పార్టీ విస్మరించింది అనేది వాస్తవం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ అమరులను స్మరించుకునేందుకే అమరవీరుల జ్యోతి నిర్మించారని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత మండలికి వెళ్లి మాట్లాడారు.. కంటతడి పెట్టారని విమర్శించారు. కవితను జైలు నుంచి తీసుకువచ్చేందుకు హరీశ్ రావు ఎంతో కృషి చేశారని చెప్పారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారని గొంగడి సునీత తెలిపారు. కేసీఆర్ ను విమర్శించి ఆమె భవిష్యత్ ను ఆమె నాశనం చేసుకున్నారని వివరించారు.