5 June, 2026 | 1:31 AM

గ్రామాలలో పారిశుధ్యం పై దృష్టి సారించాలి: మండల ప్రత్యేక అధికారి

04-06-2026 01:46 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా టేకులపల్లి మండలంలోని 9 గ్రామ పంచాయతీలలో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. మేల్లమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభకు గ్రామ సర్పంచ్ గారైన ఈర్పా విజయ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల ప్రత్యేక అధికారి, ఖమ్మం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కొండపల్లి శ్రీరామ్ పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ రాబోయే వర్షాకాలంలో పారిశుధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీల శుభ్రతను, సురక్షిత తాగునీరు, ఘణ వ్యర్థ పదార్థాల నిర్వహణ, జల సంరక్షణ మన సంరక్షణ, మొక్కల పెంపకం వ్యవసాయ శాఖలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యుత్ సమస్యలు నేటిపారుదల శాఖకు సంబంధించిన సమస్యలు ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ ఇంకుడు గుంతల ఏర్పాటు మొక్కల పెంపకం వరద నివారణ చర్యలు కొత్తగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్ డబ్ల్యూఎం నియమ నిబంధనలు పై గ్రామస్తులందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఈసం శ్రీనివాసరావు, ఇల్లందు క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, టేకులపల్లి ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్రనాథ్, ఉపాధి పథకం ఏపీవో కాళంగి శ్రీనివాస్, డిఆర్ డి ఏ అధికారి రాజు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తిరుపతి, గ్రామ కార్యదర్శి జీవన్, ఏఈఓ రెహనా బేగం, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంద్రజ, ఫీల్డ్ అసిస్టెంట్ సరిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.