ఐదు గ్రామ పంచాయతీలను.. తెలంగాణలో కొనసాగించాలి
- 13న టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో అభ్యర్థన సదస్సు
- టీజీవోఎ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు
హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరు తూ భద్రాచలంలో ఈ నెల 13న టీజీఈజేఏసీ అధ్యర్యంలో అభ్యర్థన సదస్సు నిర్వహించనున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను పురుషోత్తపట్నం, గుండాల పిచ్చికలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ నెల 13న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భద్రాచలంలోని పాత ఆర్‌అండ్‌బీ బిల్డింగ్ మైదానం లో భారీ ‘అభ్యర్థన సదస్సు’ అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులచే నిర్వహించనున్నామన్నారు.ఈ సదస్సుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మంత్రు లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఐదు పంచాయతీల ప్రజలు వైద్య, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సేవల కోసం వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది అన్నారు. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాలు విలీనమైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. కేంద్రం, ఇరు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించి, శాస్త్రీయంగా ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవా లని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్, రెవిన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, టీజీవో అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్,యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య,హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరాస్వామి, టీపీటీఫ్ కార్యదర్శి వెంగలరావు,యూటీఎఫ్ అధ్యక్షలు రంజాన్, టీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, ఫోర్త్ క్లాస్ అసోసియేషన్ బాధ్యు లు బిక్కు, వెంకటరమణ, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ విజయకుమార్, మున్సిపల్ అసోసియేషన్ సుధాకర్ బుర్రి వెంకటేశ్వర్లు, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీరస్వామి, హెచ్‌డబ్ల్యూఎస్ అధ్యక్షులు రుక్మారా వు, జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ కొప్పిశెట్టి సురేష్,పెన్షనర్స్ అసోసియేషన్ వేణు, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ బుర్రి వినోద్ కుమార్, మార్కెటింగ్ అసోసియేషన్ ఆంజనేయులు, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అస్లాం, సయ్యద్ జిలాని, టీజీవో నాయకులు సూరంపల్లి రాంబాబు, తిరుపతిరావు, శ్రీకాం త్, తాజుద్దీన్, గోపాలకృష్ణ కృష్ణార్జున తిరుపతిరావు,టీఎన్జీవోస్ మహిళా విభాగం చైర్‌పర్స న్ మృదుల, నాయకులు తాళ్లూరి శ్రీకాం త్, ఎర్రమళ్ళ శ్రీనివా సరావు,కోణార్, విక్కిర్యాల శ్రీని వాస్, జెడ్ ఎస్ జైపాల్ మల్లో జు వెంకన్న, పొ ట్ట పెంజర రా మయ్య, కేవీ రమణ, రవికుమార్, తాళ్లూరు చంద్రశేఖర్, గు డిపూడి శ్రీనివాస్, ఎంవీ వీరయ్య, దుర్గాప్రసాద్, రమణ యాద వ్, ఎర్రమల శ్రీ నివాస్ చంద్రశేఖర్ గౌడ్, గజ్జల మృ దుల ఎర్ర రమే ష్, అజ్మత్ బెగ్, గఫూర్, లింగం సురేష్, టీజీవో, టీఎన్జీవో, ఉపాధ్యాయ, అధ్యా పక, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, ఉద్యోగులు, సకల ఉద్యోగులు తదిరులు పాల్గొన్నారు.




