13 June, 2026 | 3:43 PM

ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

12-06-2026 04:01 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని రాయల్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  అపార్ట్మెంట్ వాసులు స్థానిక పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీస్ సిబ్బంది మంటలను అదుపులో తీసుకొచ్చారు.  ఘటన  సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

దీంతో ఇంట్లో ఉన్న  సామాన్లతో పాటు  బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్‌, ఏసీతో పాటు ఇతర గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు  చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర ఫ్లాట్ల నివాసితులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అరికట్టగలిగారు.ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై  ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టారు.