13 August, 2026 | 2:28 PM

మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ

13-08-2026 01:10 PM

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్

హైదరాబాద్: డా. బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో(Dr. B.R. Ambedkar Secretariat) బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ..... సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అన్నారు. బలహీనవర్గాల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి వెయ్యి ఆటోమేటిక్ కుట్టుమిషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

బీసీ మహిళలకు “కుట్టు మిషన్ పథకం” చాలా మంచి పథకం: వీహెచ్

బీసీ మహిళలకు(BC women) “కుట్టు మిషన్ పథకం” చాలా మంచి పథకమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తెలిపారు. మహిళల ఉపాధికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందన్నారు.  ఈ ఆటోమేటిక్ కుట్టు మిషన్లు భర్త చనిపోయిన మహిళలు , ఒంటరి మహిళలకు , వికలాంగులకు, టైలరింగ్ లో అనుభవం ఉన్న మేర కులస్తులకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వీహెచ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం దిశగా జోడోయాత్ర చేపట్టారు. కుల గణన చేశాం. 56 శాతం బీసీ జనాభా ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేసుకున్నాం.. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెండింగ్ లో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భవన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా పేరు మార్చుకున్నామని, ఈ పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది మహిళల ఉపాధికి ఆర్థిక వృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి హనుమంతరావు కోరారు.