9 July, 2026 | 11:09 PM

ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్

09-07-2026 02:24 PM

తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రీయల్ పాలసీ

ఔటర్ అవతలకు పరిశ్రమలు

షాబాద్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో 'ప్రీమియర్ ఎనర్జీస్'(Premier Energies) వారి అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఔటర్ అవతలకు నగరంలోన పరిశ్రమలు తరలించబోతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) అవతల భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఔటర్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పారిశ్రామిక వాడలు ఉండాలన్నారు. తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రీయల్ పాలసీ(Best Industrial Policy) ఉందని తెలిపారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని తెలిపారు.

కోర్ ఆర్బన్ ఏరియాను(Core Urban Area) డెవలప్ చేయడానికి ప్రత్యేకపాలసీ తీసుకొచ్చామని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు అవతల అగ్రి ఎకానమీ డెవలప్ చేస్తున్నామన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తామని సూచించారు. దేశ జీడీపీలో 10 శాతం వాటా తెలంగాణ నుంచే ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉండాలని కష్టపడుతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఇప్పుడున్న వసతులు సరిపోవని వెల్లడించారు. 

ఢిల్లీలో కాలుష్యం(Delhi Pollution) కారణంగా సెలవులు ఇవాల్సి వస్తోందని చెప్పిన సీఎం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఢిల్లీలో సమస్యలున్నాయని తెలిపారు. బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉందని పేర్కొన్నారు. చెన్నైలో కూడా అనేక సమస్యలున్నాయన్నారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మనం నగరాన్ని డెవలప్ చేస్తున్నామని వివరించారు.  ఆర్టిఫిషియల్ ఆక్సీజన్ మనం తయారు చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రకృతి పట్ల మనం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం అన్నారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.