లోపభూయిష్టంగా రోష్టర్
07-06-2026 12:00 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బీసీలకు ఆన్యాయం చేసే విధంగా ఉన్న రోష్టర్‌ను రివైజ్ చేసి న్యాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియమకానికి ప్రవేశపెట్టిన రోష్టర్ విధానాన్ని లోతుగా, సమగ్రంగా పరిశీలిస్తే లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు. నివారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో బీసీ నాయకులతో కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చలలో బీసీ కమిషన్ మెంబర్లుపాల్గొన్నారు.






