22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

22-06-2026 12:28 AM

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

మహబూబ్ నగర్ టౌన్ , జూన్ 21: మనల్ని సృష్టించిన దేవుడు నిత్యం కాపాడుతూ, కంటికిరెప్పలా పోషిస్తోన్నా మన పరలోకపు తండ్రిని పోలి ఈ లోకంలోని తండ్రులంతా నడుచుకోవాలని రెమా వర్షిప్ సెంటర్ డైరెక్టర్ పాస్టర్ రెవ.బిఎస్ పరంజ్యోతి పిలుపునిచ్చారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీఎస్ ఆసుపత్రి సమీపంలోని రెమా వర్షిప్ సెంటర్లో ప్రపంచ ఫాదర్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పరంజ్యోతి మాట్లాడారు.   తండ్రుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రోజు మన పరలోకపు తండ్రికి విధేయులుగా ఉంటూ, పిల్లలకు నీతి మార్గాలు బోదిస్తూ, వారిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తండ్రులంతా కృషి చెయ్యాల్సింది ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ పరంజ్యోతిని సంఘపెద్దలు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చర్చిలోని ఫాదర్స్కి ప్రత్యేక బహుమతుల్ని అందజేసి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు దేవయ్య, బలరాం, వడ్డేమాన్ రాజు, రమేష్ బహుదూర్లతో పాటు సిస్టర్స్ బ్లాండీనా, మహిమ, ప్రైయిజీరాణి, మేరి, మార్తలతోపాటు అధిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.