4 April, 2026 | 2:53 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం

04-04-2026 01:16 PM

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా శశ్రుత హాస్పిటల్ లో నిర్వహణ 

సిద్దిపేట రూరల్: వరల్డ్ హెల్త్ డే(World Health Day) సందర్భంగా శశ్రుత హాస్పిటల్‌లో రోగులు, అటెండర్లు, సిబ్బందికి హాస్పిటల్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. మురళీకృష్ణ మాట్లాడుతూ, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల వ్యాపిస్తాయని తెలిపారు. క్రాస్ కంటామినేషన్ ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయని, హ్యాండ్ హైజీన్ పాటించడం అత్యంత అవసరమన్నారు. 

చేతులు శుభ్రంగా ఉంచడం, మాస్క్ ధరించడం, రోగులను తాకే ముందు-తర్వాత చేతులు కడుక్కోవడం, స్టెరైల్ డ్రెస్సింగ్ పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. స్టెరిలైజేషన్, ఆటోక్లేవింగ్ విధానాల ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీకాంత్ ఆర్థోపెడిషన్, అరుణ్, మైక్రోబయాలజీ నిపుణులు మదన్ మోహన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్యాగ బాబు, స్వామి, అజయ్ సాయి నరేందర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.