4 April, 2026 | 2:41 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి

04-04-2026 01:18 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేంద్రబాబు

మంగపేట, (విజయక్రాంతి) : అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పాలకులకు అంటగట్టే నీచమైన బుద్దిని బీఆర్ఎస్ పార్టీ వీడనాడాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు హితవు పలికారు. శనివారం మండల కేంద్రమైన మంగపేటలో స్థానిక విలేకరులతో కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగితే ప్రభుత్వం చేసింది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దుష్ప్రచారం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం ఏదోఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా, రాష్ట్ర మంత్రి సీతక్క పైన బురద జల్లాలి అనే పద్ధతిని ఆచరిస్తున్నారని, ఆ పద్దతిని మార్చుకోవాలన్నారు.

గతoలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉనికి కోసం శవ రాజకీయలు చేశారని విమర్శించారు. ఇటీవల మేడారంలో అనుకోకుండా ప్రమాదం జరిగితే స్వార్థ రాజకీయo కోసం, దొరలు వారి స్వలాభం కోసం చిల్లర రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రమాదానికి గురై, అంగవైకల్యంతో తల్లడిల్లుతున్న చిన్నారిని చూచి కంటతడి పెట్టాల్సింది పోయి పార్టీ ఉనికి కోసం, రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాలో మెసేజులు పెట్టి పైశాచిక ఆనందం పొందటం వారి నిజానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ అంటే బరి తెగింపు రాజకీయ సమితి పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు మానుకోవాలని,వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు అని అన్నారు.