ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండల తాహశీల్దార్ లావురి మంగా, పిఎసిఎస్ ఇన్చార్జి నారాయణ స్వామి,వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్,అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు గిట్టుబాటు ధర పొందలంటే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389,బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలని,బోనస్ 500 రూపాయలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ రామచంద్రయ్య, ఆర్ఐ శివ,సిఇఓ తిరుపయ్య, ఎఈఓ శ్రావ్య,ఉపసర్పంచ్ శౌరి,సిబ్బంది సతీష్,నాగరాజు, సామేలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.




