13 March, 2026 | 1:10 AM

మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం

12-03-2026 06:04 PM

ముఖ్యఅతిథిగా పాల్గొని  వాలంటీర్లకు సొంత నిధులతో సాలరీ అందించిన దొంతిరి హరిశంకర్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ని జెడ్‌పిహెచ్‌ఎస్  మెడిపల్లి పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్య ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్  దొంతిరి హరిశంకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. అదేవిధంగా పాఠశాలలో సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను అభినందిస్తూ  హరిశంకర్ రెడ్డి నాలుగు నెలల జీతాలను స్వయంగా అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.