ఉపరితల ఖాళీల భర్తీ ప్రకటన విడుదల పట్ల హర్షం
టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
మణుగూరు, మార్చి 1,(విజయక్రాంతి) : ఏరియాలోని ఉపరితల విభాగంలో జనరల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను గుర్తించి వాటిని కొండాపురం అండర్ గ్రౌండ్ కార్మికులతో డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు యాజమాన్యం ప్రకటన విడుదల చేయడం పట్ల టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఆసక్తి గల అండర్గ్రౌండ్ కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మార్చి 2వ తేదీ వరకు గడువు ఇవ్వడం సానుకూల నిర్ణయమని ఆయన పేర్కొ న్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏరియాకు నిర్దేశించిన 114 లక్షల 90 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఖాళీల భర్తీ తో అండర్ గ్రౌండ్ కార్మికులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
ఏరియాలో చైన్ మెన్, అసిస్టెంట్ చైన్ మెన్, చార్జర్ సేఫ్టీ ల్యాంపు తదితర పెండింగ్ ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వరరావు, సంపత్ కుమార్,రమేష్, పి.కె. నాగరాజు, పరమేష్, ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్, ఇజ్రాయిల్, మస్తాన్, సాంబార్ రాజశేఖర్, వినయ్ కుమార్ రమేష్ నాయక్, పడ్డం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.




