11-02-2026 01:19:08 AM
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి):జిల్లా లో మున్సిపల్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని, జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో ఉదయం 7.00 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయి సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందని తెలిపారు.
అలాగే జనగామ మున్సిపాలిలో 30 వార్డులు, గాను 66 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు తో పాటు స్టేషన్ ఘన్పూర్ లో 18 వార్డులకు 36 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు.;అలాగే జిల్లాలో రేపు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 62 వేల 595 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని,
ఇందులో జనగామ మొత్తం 44,045 ఓటర్ల లో పురుషులు 21,358, స్త్రీలు 22,678 ఓటర్లు, ఇతరులు 9 మంది ఓటర్లు ఉన్నారని అలాగే స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో మొత్తం 18,550 మంది ఓటర్లకు పురుషులు 8,913 మంది స్త్రీలు 9,636 మంది అలాగే ఇతరులు ఒక్కరు ఓట హక్కు కలిగి ఉన్నారని, వీరందరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
జనగామ మున్సిపాలిటీలో 80 మంది ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు మరియు 240 ఇతర పోలింగ్ అధికారులు అలాగే స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్లో 44మంది ప్రిసైడింగ్ , 44 మంది సహాయ ప్రిసైడింగ్ మరియు 132 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. అలాగే జనగామ మున్సిపాలిటీలో 28 , స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటికి 9 మంది మైక్రో అబ్జర్వర్స్ను నియమించినట్లు తెలిపారు.
ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరుగకుండా ఇప్పటికే ఎఫ్ ఎస్ టి , ఎస్ ఎస్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే 9 మంది జోనల్ ఆఫీసర్స్ను, 9 మంది రూట్ అధికారులను నియమించామని తెలిపారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఒక్కొక్కరి వ్యయ (ఖర్చుల) పరిశీలకులను నియమించామని అన్నారు. ఈ నెల 11వ, తేది ( బుధవారం) రోజును ఎన్నికల జరుగనున్న సందర్బంగా పోలింగ్ బూతుల వద్ద ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.