calender_icon.png 14 February, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్షన్.. టెన్షన్!

13-02-2026 12:00:00 AM

అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే

ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం

8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

సంగారెడ్డి /మెదక్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీ లు, 256 వార్డు లు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు అలాగే మెదక్ జిల్లాలో నాలుగు ము న్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా, ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం మెదక్ జిల్లాలోని మె దక్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పట్టణంలోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.

అలాగే నర్సాపూర్ లో ఓ ట్ల లెక్కింపు కేంద్రాన్ని బీవీఆర్‌ఐటి కళాశాలలో ఏర్పాటు చేశారు. తూప్రాన్ మున్సి పల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని నోబెల్ ఫార్మా కాలేజీ లింగారెడ్డి పల్లి, రామాయంపెట్ లో ఎంపిడీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఓట్లు 86109 ఉండగా, 69823ఓట్లు పోలయ్యా యి. ఇందులో పురుషులు 41516మందికి గాను 33806మంది ఓటర్లు ఓటు వేశారు. అలాగే మహిళా ఓటర్లు 44591 ఉండగా, 36015 మంది ఓట్లు వేశారు.

 ఎవరి ధీమా వారిది...

మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ అనంతరం కౌంటింగ్ పై దృష్టి పెట్టారు. శుక్రవారం ఉద యం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఎవరి ధీ మాలో వారు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో మెదక్ జిల్లాను నాలుగు మున్సి పాలిటీల్లోనీ అన్ని వార్డుల్లో ఓటింగ్ నమో దు విషయంపై చర్చలు మొదలయ్యాయి. వార్డుల వారీగా అభ్యర్థులు, రాజకీయ పా ర్టీల నాయకులు ఓటింగ్ నమోదుపై లెక్క లే సుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయోనని చర్చించుకుంటున్నారు.

మెదక్ మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. ఈ నేపథ్యంలో వార్డు ల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు ఏ మేర కు ఓట్లు వచ్చాయో అని లెక్కలేసుకుంటున్నారు. జరిగిన ఓటింగ్ సరళి మేరకు అన్ని స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని గులాబీ పార్టీ శ్రేణులు ధీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వార్డుల వా రీగా ఓటింగ్ నమోదు విషయాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం వెలువడనున్న ఫలితాలపై అందరూ దృష్టి సారించారు.

 మున్సిపల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాటు పూర్తి: ---జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ 

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వో లు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు ,మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రా హుల్ రాజ్ ఎన్నికల అధికారులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ రామాయంపెట్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూ మును, కౌంటింగ్ హాలును జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్ , డిఎస్పీ ప్రసన్నకుమార్,ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ కు పోలీస్ మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కౌంటింగ్ రోజు ఆర్వోలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు,ఉదయం 5:45 లోపల కౌంటింగ్ కేంద్రంలో ఉండాలన్నారు. కౌం టింగ్ హాలులో ఫోను అనుమతి లేదన్నారు. ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా, టేబుల్ వారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ తహసి ల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,ఆర్వో లు, సూపర్వైజర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.