25 March, 2026 | 12:24 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

భగత్‌సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

25-03-2026 12:55 AM

సీపీఎం మండల కార్యదర్శి శంకర్ రెడ్డి

నూతనకల్, మార్చి 24: భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో యువశక్తిని మేల్కొల్పిన మహా విప్లవకారుడు భగత్ సింగ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సీపీఎం మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని వెంకపల్లి గ్రామంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని శంకర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బత్తుల జనార్ధన్, చూడి మధుసూదన్ రెడ్డి, తొలుకునూరి ఉప్పలయ్య, శ్రీను, శ్రీరంగం లక్ష్మయ్య, చంద్రయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.