21 July, 2026 | 5:49 PM

ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలి

21-07-2026 12:06 AM

తాడ్వాయి,జూలై,20( విజయ క్రాంతి ): ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేసుకోవాలని ఎర్రపహాడ్ వైద్యాధికారి ఖాసిం తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలకు అందరూ హాజరై పరీక్షలు చేసుకోవాలన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా 72 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య,వైద్యులు రాకేష్, హెచ్ ఈ ఓ నారాయణ,సిబ్బంది నక్షత్రం, వజ్రం,ఆశా వర్కర్లు నాగరాణి, అర్చన, సంతోషి తదితరులు పాల్గొన్నారు.