3 July, 2026 | 3:04 AM

ఓటరు సర్వేలో అందరూ భాగస్వాములు కావాలి

03-07-2026 12:07 AM

ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి,జులై 2 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు.ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ,ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు సక్రియంగా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు చాలా ముఖ్యం.

ప్రతి ఓటరు తన వివరాలను పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారి (బీఎల్వో)లకు అందజేసి రసీదు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని ఆయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన అన్ని వ్యక్తులు ఓటరు జాబితాలో చేరి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.