3 July, 2026 | 4:36 AM

సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60 వేల చెక్కు అందజేత

03-07-2026 12:06 AM
  1. మన్సూరాబాద్ డివిజన్ లబ్ధిదారురాలికి 
  2. సహాయనిధి అందించిన జక్కిడి సత్యతేజ రెడ్డి

నాగోల్, జూలై 2 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్కు చెందిన నరాల పార్వతికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును కాంగ్రెస్ యువనేత జక్కిడి సత్యతేజ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూత అందిస్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, మున్నా జానీ, విఠల్ రెడ్డి, జకీర్ తదితరులు పాల్గొన్నారు.