20 May, 2026 | 3:55 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలి

30-11-2025 08:03 PM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్..

చిట్యాల (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆదివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అవగాహన కల్పించారు. గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు. గుండ్రంపల్లి యూ - టర్న్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ను పరిశీలన చేసి తరుచూ ప్రమాదాలు జరుగుతునందున కమిటీని ఏర్పాటు చేసుకోవాలి గ్రామస్తులను సూచించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సిఐ కే.నాగరాజు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.