21 July, 2026 | 8:56 PM

ప్రజావాణి ప్రతి ఫిర్యాదును వేగవంతంగా పరిష్కరించాలి

21-07-2026 01:57 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ: జులై 20(విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్  స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

అక్కడ ఉన్న జిల్లా అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ పోర్టల్ లో పరిశీలించాలని, పరిష్కార చర్యలు సంబంధిత శాఖల అధికారులు చేపట్టాలన్నారు .  ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో  ఉండకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి,జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డి ఆర్ డి ఓ మేన శ్రీను, జెడ్పి సీఈవో శేషాద్రి, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.