21 July, 2026 | 5:57 PM

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

21-07-2026 01:58 AM

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జులై 20 (విజయక్రాంతి):ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

ప్రతి దరఖాస్తును అధికారులు నిశితంగా పరిశీలించి, బాధితులకు తగిన న్యాయం జరిగేలా త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, జిల్లాలో పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రస్తుతం 57 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని వెంటనే పరిష్కరించి, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.