12 July, 2026 | 2:54 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాము

19-12-2025 09:57 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్రజలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఏనుమాముల గ్రామంలో శివాలయలింగము, బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమలకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీ పేస్ వన్ లో ప్రధాన సమస్యగా ఉన్న స్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్వాడి, ఇంటి నెంబర్ల, ఇళ్ళపట్టాలు తదితర సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.