2 June, 2026 | 8:02 PM

జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం

02-06-2026 06:32 PM

గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ (జేఏసీ ) పిలుపు

 అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

జవహర్ నగర్,(విజయక్రాంతి): గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జవహర్‌నగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ 'మానవహారం' నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ (జేఏసీ ) నాయకులు ప్రకటించారు. మంగళవారం గిరిప్రసాద్ నగర్‌లోని సిపిఐ  కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ తోటపల్లి శంకర్ అధ్యక్షతన అఖిలపక్ష అత్యవసర సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... గబ్బిలాలపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాల సాధన కోసం రేపు అంబేద్కర్ విగ్రహం వద్ద దాదాపు 200 మందితో శాంతియుతంగా మానవహారం చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమానికి గబ్బిలాలపేట, గిరిప్రసాద్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, నందమూరి నగర్ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.