13 August, 2026 | 3:49 PM

గ్రామపంచాయతీలో గ్రంథాలయం ఏర్పాటు

13-08-2026 02:18 PM

బోథ్ ఆగస్టు 13 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో  గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని పాలకవర్గం వారు ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో కాంపిటీటివ్ బుక్స్ తో పాటు మహనీయుల జీవిత చరిత్ర కథల పుస్తకాలు విద్యార్థులకు నిరుద్యోగులకు అవసరమయ్యే పార్టీ పుస్తకాలు  అందుబాటులో ఉంచనున్నారు గ్రామంలోని విద్యార్థులు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలకవర్గం వారు కోరారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో పుస్తక పఠన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సొనాల గ్రామ పాలక వర్గం 

కాంపిటీటివ్ బుక్స్, మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు, కథల పుస్తకాలు...మొదలగు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. గ్రామస్థుల సౌకర్యార్థం డైలీ న్యూస్ పేపర్లు కూడా అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో ఉద్యోగాలు సాధించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడుతుంది.