విద్యతోనే సమన్యాయం: ఎమ్మెల్యే మాణిక్ రావు
ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : ఎంపీ సురేష్ షెట్కా ర్
జహీరాబాద్, ఏప్రిల్ 14 :విద్యతోనే సమాజంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణికరావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ లో అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాభివృద్ధికై ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలు ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉన్న రాజ్యాంగాలలో మన రాజ్యాంగం చాలా గొప్పదని తెలిపారు.
జహీరాబాద్ లో 200 కోట్ల రూపాయల విలువతో ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇండియా స్కూల్ స్థాపించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, నామ రవి, కిరణ్, షేక్ ఫరీద్, ఖండెం నరసింహులు, రాంచందర్, భీమ్, వంశీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






