ప్రమాదవశాత్తు ఆలయ కోనేరులో పడి ఒకరి మృతి
01-08-2026 09:50 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని ఆలయ కోనేరులో ప్రమాద వశాత్తు పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు శ్రీ చెన్నకేశవనాథ స్వామి ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో ఇందిరానగర్ కు చెందిన కాంపల్లి పోచయ్య (68)అనే వ్యక్తి ప్రమాద వశాత్తు జారీ పడి మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం ఆలయ కోనేరులోని మెట్ల పై స్నానం చేస్తుండగా జారీ కోనేరులో పడి మృతి చెందినట్లు ఎస్ ఐ పేర్కొన్నారు.సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్ ఐ కేస్ నమోద్ చేసుకొని దర్యాప్తు ప్రారంభం చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.






