14 August, 2026 | 1:29 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

14-08-2026 12:34 AM

-ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఆగస్టు 13 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.యూసుఫ్ గూడలో గురువారం నిర్వహించిన జీరో ప్లాస్టిక్ 2040 - క్లీన్ - క్లీన్ అప్ క్యాంపెయిన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజువారీ కార్యకలాపాల్లో ప్లాస్టిక్ వినియోగం వీలైనంత తగ్గించాలన్నారు.

తద్వారా దాని వల్ల కలిగే అనర్థాలను నివారించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం జవహర్ నగర్ లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు,యువత,స్వచ్ఛంధ సంస్థలు కలిసికట్టుగా పని చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పర్యావరణ అధికారులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,స్థానికులు,వాలంటీర్లు తదితరులున్నారు.