వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి
ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు. కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ
కోదాడ,(విజయక్రాంతి): వీబీజీ రాంజీ చట్టం 2025 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోతాయని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ ఆందోళన వెలిబుచ్చారు. సోమవారం ఆయన కోదాడలో మాట్లాడుతూ ఈ చట్టం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం గ్రామీణ ఉపాధి హామీ భవిష్యత్తు తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు కూలీల జీవనోపాధిపై చట్టం యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా అమలు చేయడం సాధ్యం కాదని దీనివల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కూలి రేట్లపై కూడా ప్రతి కూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం కూడా అన్యాయం అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.






