గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్
భద్రాచలం (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు చందనకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాంబాబులు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారి ఆదేశములననుసరించి DEO ను, స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయురాలను GCDO గా నియమించాలని, ఇతర పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరతను బట్టి విద్యార్థుల సంఖ్యాబలం ఆధారంగా డిసెండింగ్ ఆర్డర్లో సర్ప్లస్ టీచర్లను గుర్తించి, సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి డిప్యూటేషన్ వేయాలి.
ఈ ప్రక్రియలో సీనియర్ ను ఆప్షనల్ గా జూనియర్ కంపల్సరిగా పరిగణించి కౌన్సిలింగ్ ద్వారా డిప్యూటేషన్లు నిర్వహించాలని, ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేయాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు అవసరమైన డాక్యుమెంట్లతో సమర్పించబడిన కారుణ్య నియామక ప్రతిపాదనలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని సదరు ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ఉపాధ్యాయుల సస్పెన్షన్ పీరియడ్ లను సెటిల్మెంట్స్ చేయాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ & ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రతిపాదనలు పెండింగ్లో ఉంటున్నాయి. సదరు పైళ్లను వెంటనే పరిష్కరించాలి.
DSC-2008 కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుల జీతములు ది.12.06.2026 నుండి చెల్లించాలని, ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే రిటైర్మెంట్ ఆర్డర్ ను ఇస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కావడానికి ఆలస్యం అవుతున్నది. ప్రతి సంవత్సరం జనవరి మరియు డిసెంబర్ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయుల రిటైర్మెంట్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, 1997 మరియు 2012 డీఎస్సీ ఉపాధ్యాయుల గౌ.తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్ గారి ఆదేశములు అమలు చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలను మంజూరి కొరకు ఉన్నతాధికారులకు వెంటనే పంపించి సంబంధిత ఉపాధ్యాయులకు సమాచారం అందించాలి.
మంజూరి తదుపరి సపోర్టింగ్ ఆదేశములు & ఒరిజినల్ బిల్స్ ఎటువంటి జాప్యం లేకుండా ఉపాధ్యాయులకు అందించాలని, ఉన్నత పాఠశాలలలో FAC ప్రధానోపాధ్యాయులుగా నియమింపబడి పనిచేస్తున్న వారికి FAC అలవెన్స్ లను చెల్లించాలని, వేసవి సెలవులలో పదవ తరగతి విధులు నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రిజర్వేషన్ న్యూస్ మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల వ్యక్తిగత సమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా రాంబాబు రాష్ట్ర కౌన్సిలర్ కె.మాధవరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పి.కృష్ణయ్య సభ్యులు సి ఆర్టిలు తదితరులు పాల్గొన్నారు.






